మంచు విష్ణు కన్నప్ప’ రీ రిలీజ్.. ఈ సారైనా
Actor ProfileActor

మంచు విష్ణు కన్నప్ప’ రీ రిలీజ్.. ఈ సారైనా

Total News1
Movie Updates0
Sources1
మంచు విష్ణు కన్నప్ప’ రీ రిలీజ్.. ఈ సారైనా
Chitrajyothy17 Jun 2026
మంచు విష్ణు కన్నప్ప’ రీ రిలీజ్.. ఈ సారైనా

మంచు విష్ణు హీరోగా, రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా, రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఓ కీలక పాత్రలో నటించిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ఈ చిత్రం విడుదలై వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై డా. ఎం. మోహన్ బాబు (M Mohan Babu) ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ (రీసెంట్‌గా వచ్చిన అర్జున్ ‘బ్లాస్ట్ జోన్’ మూవీ ఫేమ్) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. హీరో విష్ణు మంచు తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి తెలుగులో వచ్చిన ఆదరణ, క్లైమాక్స్‌లో విష్ణు నటనకు వచ్చిన ప్రశంసలను దృష్టిలో పెట్టుకని మరోసారి ఈ విజువల్ వండర్‌ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకురాబోతున్నారు. జూన్ 27న ‘కన్నప్ప’ని లిమిటెడ్ స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతోన్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ విడుదల చేసిన రీ రిలీజ్ (Kannappa Re Release) డేట్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మంచు మోహన్ బాబు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. సినిమాకు మంచి పేరు, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా, కలెక్షన్ల పరంగా మాత్రం.. ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. ఈ మధ్యకాలంలో