మా గ్రామాన్ని పంచాయతీ చేయండి సారూ
Actor ProfilePolitician

మా గ్రామాన్ని పంచాయతీ చేయండి సారూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మా గ్రామాన్ని పంచాయతీ చేయండి సారూ
Eenadu30 Aug 2026
మా గ్రామాన్ని పంచాయతీ చేయండి సారూ

పింఛను లబ్ధిదారు పద్మమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు ఈనాడు-నెల్లూరు, న్యూస్‌టుడే-చిల్లకూరు: పింఛను లబ్ధిదారును ఏం కావాలమ్మా? అని ముఖ్యమంత్రి అడగ్గా ‘మా గ్రామాన్ని పంచాయతీ చేయండి సారూ’ అని విన్నవించారు. ‘పేదల సేవ’లో భాగంగా సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలోని ఎస్సీ కాలనీలో చుండు పద్మమ్మ ఇంటికి బుధవారం వెళ్లి వితంతు పింఛను రూ.4వేలు అందజేసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అదే ఇంట్లో ఉంటున్న ఆమె సోదరి, మానసిక దివ్యాంగురాలు పోలుబోయిన తులశమ్మకు రూ.15వేల నగదు అందజేశారు. అనంతరం వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇంట్లో ఏడుగురం ఉంటున్నట్లు చెప్పడంతో ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారని అడిగారు. మూడు పడకల ఇల్లు కట్టించి ఇస్తామనడంతో జీవితాంతం రుణపడి ఉంటామని ఆ కుటుంబసభ్యులు తెలిపారు. కుమార్తె పెళ్లి, కుమారుడి ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటామని, టిఫిన్‌ దుకాణం ఏర్పాటుకు ఓ గదిని నిర్మించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. గ్రామాన్ని పంచాయతీ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు