
ఇంటర్నెట్ డెస్క్: సమంత, రాజ్‌లకు చిరంజీవి దంపతులు సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్రబృందాన్ని చిరంజీవి (Chiranjeevi) అభినందించారు. టీమ్‌ను ఇంటికి పిలిచి సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సమంత దంపతులకు నూతన వస్త్రాలతో పాటు బహుమతిని అందించారు. కాసేపు ఆ జంటతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ ఫొటోలను పంచుకున్న సామ్.. చిరుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు చూపించిన ఆదరణ, మద్దతుకు ధన్యవాదాలు. మీ ప్రశంసలకు మా చిత్ర బృందం ఎంతో సంతోషిస్తోంది’’ అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ‘మెగా బంగారం మూమెంట్’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొందరు మాత్రం సమంత తల్లి కానున్న నేపథ్యంలో చిరంజీవి దంపతులు సారె పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. సమంత సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవీ పిక్చర్స్’పై తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సమంత ఈ పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాతో మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతున్న వేళ మెగాస్టార్ నుంచి ప్రశంసలు రావడం చిత్రయూనిట్‌లో జోష్ నింపింది. మరోవైపు మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.43కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది (Maa Inti Bangaram Collections). గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు