
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత సతీష్ కిలారు, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, మైత్రీ శశి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బుచ్చిబాబు గారు.. చరణ్ గారికి ‘పెద్ది’ వంటి అద్భుతమైన సినిమా ఇచ్చారు. మీ తదుపరి సినిమా కూడా చరణ్ గారితోనే ఉంటుందని వింటున్నాం. అది ఎంతవరకు నిజం? -దేనికైనా సమయమే నిర్ణయిస్తుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. నేను కూడా అది జరగాలని కోరుకుంటున్నాను. అనంత శ్రీరామ్ గారు.. ‘పెద్ది’లో అన్ని రకాల పాటలు రాశారు. అయితే ఐటెమ్ సాంగ్‌పై కొన్ని విమర్శలు వస్తున్నాయి. దానిపై మీ స్పందన? -ఐటెమ్ సాంగ్‌ను ఐటెమ్ సాంగ్‌లాగే ఆస్వాదించాలి. విమర్శగానీ, ఆరోపణగానీ నిర్దిష్టంగా ఉండాలి. ప్రత్యేకంగా ఎజెండా పెట్టుకుని మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తాత్వికంగా, తార్కికంగా మాట్లాడితే, ఎవరైనా చేసిన విమర్శలకు నేను నిజాయితీగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. బుచ్చిబాబు గారు.. ‘పెద్ది’ సినిమాలో కొత్త సన్నివేశాలు జోడిస్తున్నారని విన్నాం. ఎప్పటి నుంచి యాడ్ చేస్తారు? -ఆల్రెడీ ఎడిట్ చేశాం. ఈ బుధవారం నుంచి యాడ్ అవుతాయి. మొత్తం మూడు సన్నివేశాలు జోడించాం. హీరోయిన్‌కు సంబంధించిన మూడు సీన్లు, అలాగే జగపతిబాబు గారికి ఒక సీన్