తెలుగు డిజిటల్ వినోద రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. వివాహ బంధం చుట్టూ తిరిగే సున్నితమైన హాస్యాన్ని, భార్యాభర్తల మధ్య వచ్చే ఈగోలను వినోదాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్.. వరుసగా మూడు సీజన్లతో ఘన విజయాన్ని అందుకుంది. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' వేదికగా విడుదలైన సీజన్ 3 సైతం ప్రేక్షకులను అమితంగా అలరించింది. మొదటి రెండు భాగాల తరహాలోనే మూడో సీజన్‌కు కూడా అద్భుతమైన స్పందన రావడంతో ఈ సిరీస్ షో రన్నర్, ప్రముఖ దర్శకుడు మహి వి. రాఘవ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీజన్ 3 ముగింపులో చూపించిన 'కాస్మిక్ ట్విస్ట్' ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఈ మలుపు సిరీస్ కథను మరో సరికొత్త కోణంలోకి తీసుకెళ్లడంతో, కథాంశంపై వీక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ భారీ విజయాల జోష్‌తో మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తదుపరి భాగమైన 'సేవ్ ది టైగర్స్' సీజన్ 4 ( Save The Tigers Season 4 )కు సంబంధించిన సన్నాహాలను అప్పుడే ప్రారంభించేశారు. నాలుగో భాగాన్ని మునుపటి కంటే మరింత భారీ స్థాయిలో, ఎంతో వైభవంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.* ఓటీటీలో ‘సేవ్ ది టైగర్స్ 3’ సరికొత్త రికార్డులు.. సౌత్ డిజిటల్ స్పేస్‌ను షేక్ చేస్తున్న మహి వి రాఘవ్ కథలోకి స్టార్ హీరో ఎంట్రీఅయితే ఈ నాలుగో సీజన్‌కు సంబంధించి ఒక అద్భుతమైన వార్త ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రేజీ సిరీస్‌లోకి టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరోని రంగంలోకి దించేందుకు లీడ్ టీమ్ గట్టి ప్రయత్నాలు చేస్తోందట. పెళ్లయిన మూడు వేర్వేరు జంటల మధ్య ఉండే చిన్నపాటి గొడవలు, సరదా సంభాషణలు, ఈగో క్లాషెస్‌తో సాగే ఈ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఒక
Actor ProfileActor
మొగుడు పెళ్ళాల గొడవల్లోకి స్టార్ హీరో.. 'సేవ్ ది టైగర్స్ 4' లో క్రేజీ ట్విస్ట్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•31 Jul 2026
మొగుడు పెళ్ళాల గొడవల్లోకి స్టార్ హీరో.. 'సేవ్ ది టైగర్స్ 4' లో క్రేజీ ట్విస్ట్