
ప్రస్తుతం ఆడియన్స్ ఎక్కువ శాతం థియేటర్ల కంటే ఓటీటీలకే జై కొడుతున్నారు. రకరకాల కంటెంట్, బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఓటీటీ షోలు గ్యాప్ లేకుండా ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ప్రేక్షకులను మెపపించడానికి పోటీ పడి మరీ ఓటీటీలు డిఫరెంట్ కంటెంట్ ను అందిస్తున్నాయి. ఈక్రమంలో రీసెంట్ గా ఓ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది. అక్రమ సంబంధం నేపథ్యంలో వచ్చిన ఈసినిమాప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఆ మూవీ మరేదో కాదు...2021లో విడుదలైన హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ 'హసీన్ దిల్‌రుబా'. వినిల్ మాథ్యూ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ పన్ను రాణి కశ్యప్ పాత్రలో నటించగా, విక్రాంత్ మాస్సే ఆమె భర్త రిషభ్ సక్సేనా పాత్రను పోషించారు. హర్షవర్ధన్ రాణే రిషభ్ కజిన్ నీల్ త్రిపాఠి పాత్రలో కనిపించారు. నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ ను సాధించింది మూవీ. ప్రేమ, నేరం, మోసం, లాంటి అంశాలను మేళవించిన ఈ కథ... క్రైమ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స ను చివరి క్షణం వరకు కట్టిపడేసింది. ఒక చిన్న టౌన్ లో జరిగిన హత్య కేసు చుట్టూ తిరిగే ఈ కథలో అనేక ఎమోషన్స్ కనిపిస్తాయి. కథ ప్రారంభంలో రిషభ్ ఇంట్లో భారీ పేలుడు సంభవిస్తుంది. ఆ ఘటనలో ఒక మృతదేహం లభించడంతో అది రిషభ్‌దేనని పోలీసులు భావిస్తారు. ఈ సంఘటనతో అతని భార్య రాణిపై అనుమానాలు వ్యక్తమవుతాయి. విచారణ ప్రారంభమైన తర్వాత రాణి తన జీవితంలో జరిగిన సంఘటనలను పోలీసులకు వివరిస్తుంది. ఈ క్రమంలో ఫ్లాష్‌బ్యాక్ రూపంలో ఆమె జీవితంలోని అనేక విషయాలు రివిల్ అవుతూ ఉంటాయి. రాణి, రిషభ్‌ల వివాహం పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి తర్వాత రిషభ్ స్వభావం రాణికి అంతగా నచ్చదు. అతనితో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. రిషభ్ మాత్రం ఆమెను ఎంతో ప్రేమిస్తుంటాడు.. బాగా చూసుకుంటాడు