
India vs Afghanistan Match : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్


India vs Afghanistan Match : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్

KTR Comments : ఖమ్మం జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, జిల్లా మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు “మొనగాళ్లు కాదు, ముగ్గురు మోసగాళ్లు” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ మంత్రులు నెరవేర్చలేదని, కేవలం ప్రజలను దగా చేయడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. మళ్లీ ఎలాగూ తాము అధికారంలోకి రాబోమనే నిరాశ, భయం కాంగ్రెస్ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అందుకే ఉన్న కొద్దిపాటి కాలంలోనే రాష్ట్రాన్ని, జిల్లాను నిలువునా దోపిడీ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. Read Also : రేపే తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలని కేటీఆర్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని రుణమాఫీ, రైతుబంధు (రైతు భరోసా) ఆలస్యం, నిరుద్యోగ భృతి వంటి మోసపూరిత వాగ్దానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడి, రాబోయే ఎన్నికల్లో ప్రతి బూత్‌లోనూ బీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఖమ్మం గడ్డపై గులాబీ జెండాను మళ్లీ సగర్వంగా ఎగురవేయాలని కేటీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. Keerthy Suresh Sathyavan Savithri Movie: కీర్తి సురేష్ ‘సత్యవాన్ సావిత్రి’ రిలీజ్ డేట్ వచ్చేసింది! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. CM Revanth : రేవంత్ చేతగానితనం వల్లే తెలంగాణ లో