మేకను కాపాడబోయి నీటి కొలనులో పడి మహిళా రైతు మృతి
Actor ProfilePolitician

మేకను కాపాడబోయి నీటి కొలనులో పడి మహిళా రైతు మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మేకను కాపాడబోయి నీటి కొలనులో పడి మహిళా రైతు మృతి
HMTV23 Aug 2026
మేకను కాపాడబోయి నీటి కొలనులో పడి మహిళా రైతు మృతి

Bachannapet: మేకను కాపాడబోయి నీటి కొలనులో పడి మహిళా రైతు మృతి బచ్చన్నపేట: బచ్చన్నపేట మండలంలోని మొండికుంట సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నరామంచర్ల గ్రామానికి చెందిన గుండా వాణి (33), భర్త ఉపేందర్, వ్యవసాయదారురాలు, వ్యవసాయ నీటి కొలనులో పడిన మేకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయింది. ఆమెకు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు బచ్చన్నపేట మండల ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే బచ్చన్నపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా బచ్చన్నపేట పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, నీటి కొలనులు, చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఒంటరిగా నీటిలో దిగరాదని సూచించారు. కుటుంబ సభ్యులు, రైతులు తగిన భద్రతా చర్యలు పాటించడం ద్వారా ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు