
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ మూవీతోనే పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ..' తెలుగు ఆడియెన్స్ అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీవాన సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్‌కు కూడా వస్తోంది. తెలుగు సినిమా మరే భాష చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉంటుందని నేను దీవాన చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు' అని అన్నారు. హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మేము గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా. మేము ఒక రియల్ లైఫ్ మా సినిమాలో చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజేస్ పంపుతున్నారు. మీరు థియేటర్ కు రండి, మా సినిమా మీకు లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి