
'చింతలు తీర్చేది - చిన్న సినిమానే' (Low Budget Movies)అనే వారు కొందరు దర్శక నిర్మాతలు. ఇప్పుడు మరికొందరు మేకర్స్ అదే మాట అంటున్నారు. 'చింతలు తీర్చేది - చిన్న సినిమానే' (Low Budget Movies)అనే వారు కొందరు దర్శక నిర్మాతలు. ఇప్పుడు మరికొందరు మేకర్స్ అదే మాట అంటున్నారు. ఎందుకలాగా అంటే భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతోంటే కొన్ని లో-బడ్జెట్ మూవీస్ మురిపిస్తున్నాయి. ఆ ముచ్చటేంటో చూడాలి మరి... 'రూపాయి ఖర్చు పెట్టి వంద రూపాయలు సంపాదిస్తే గొప్ప' - అంతేగాని, 'వెయ్యి రూపాయలు వెచ్చించి వెయ్యిన్నొక్క రూపాయి సాధిస్తే ఏం గొప్ప?'... ఇలాంటి మాటలు ప్రపంచంలోని అన్ని సినిమా రంగాల్లోనూ వినిపిస్తూంటాయి. హై -బడ్జెట్ మూవీస్ ఎంత వసూళ్ళు చూసినా వాటి లాభాలను బేరీజు వేస్తే - లో-బడ్జెట్ లో హిట్ టాక్ సంపాదించిన సినిమాల ప్రాఫిట్స్ కన్నా తక్కువనే చెప్పాలి. స్టార్స్ నటించే సినిమాలకు ఎంతలేదన్నా వంద కోట్ల బడ్జెట్ తో చిత్రాలను తీస్తారు... బొటాబొటీగా బాక్సాఫీస్ వసూళ్ళు చూస్తే దానిని హిట్ అనలేం. ఎందుకంటే నిర్మాతలకు బాక్సాఫీస్ కాకుండా తమ సినిమాలపై ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ ద్వారా మరికొంత సొమ్ము పోగవుతుంది. అందువల్ల స్టార్స్ తో సినిమాలు తీసేవారికి నష్టాలు కనిపించవు. అయితే స్టార్స్ సినిమాలు కదా అని అత్యాశతో కొనుగోలు చేసినవారికే థియేటర్స్ లో నష్టాలు పొడసూపుతూ ఉంటాయి. ఇలా మనదేశంలో పలు సినిమారంగాలు సాగుతున్నాయి... టాలీవుడ్ పరిస్థితి కూడా అదే. ఈ సమయంలోనే సమంత 'మా ఇంటి బంగారం'గా జనం ముందు నిలిచారు. ఈ మూవీ పెట్టుబడికి రెండింతలు రాబడి చూస్తోందని టాక్. మొదట్లో వినిపించని మోత... గత సంవత్సరం కూడా పలు లో-బడ్జెట్ మూవీస్ తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ మంచి విజయం సాధించాయి. ఈ చిత్రాలు ఇంత సక్సెస్ సంపాదించడానికి కారణం- అందులోని కంటెంట్ అనే చెప్పాలి. సినిమాలో సత్తా