మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్ బ్యాక్ ఫిల్మ్ ఎలా ఉందంటే
Actor ProfileActor

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్ బ్యాక్ ఫిల్మ్ ఎలా ఉందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్ బ్యాక్ ఫిల్మ్ ఎలా ఉందంటే
Asianet News Telugu19 Jun 2026
మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్ బ్యాక్ ఫిల్మ్ ఎలా ఉందంటే

సమంత అనారోగ్యంతో మూడేళ్ల క్రితం సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఇస్తూ ఆమె `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటించింది. `ఓ బేబీ` తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేసిన చిత్రమిది. ట్రాలాల పిక్చర్స్ పతాకంపై సమంత, ఆమె భర్త రాజ్‌ నిడిమోరు దీన్ని నిర్మించారు. ఇందులో శ్రీముఖి మరో కీలక పాత్రలో నటించారు. టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు శుక్రవారం(జూన్‌ 19)న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? సమంత అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. స్వర్ణ(సమంత)... హనీ(దిగంద్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. హనీ డాక్టర్‌. హనీ చెల్లి పెళ్లి కోసం చాలా రోజుల తర్వాత తన ఊరు బల్లవరం కి వస్తారు. స్వర్ణని చూసి ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోతారు. ఇంట్లో అందరు ఆమెని అంత ఈజీగా కలుపుకోరు. ప్రశ్నలతో ఆడుకుంటారు. దీంతో వారిని మ్యానేజ్‌ చేయలేక ఇబ్బంది పడుతుంది స్వర్ణ. కానీ నెమ్మదిగా వారికి నచ్చిన పనులు చేస్తూ దగ్గరవుతుంది. అటు మామయ్య, అత్తయ్యలను కూడా ఫిదా చేస్తుంది. ఉత్తమ కోడలిగా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తనని ఒకడు వెంటాడుతుంటాడు. అతను కరుణ(గుల్షన్‌ దేవయ్య) మనిషి. తను అచ్చం ఝాన్సీలా ఉండటంతో ఆమెని చంపేయమని చెబుతాడు. కానీ కరుణ మనిషిని చంపేస్తుంది స్వర్ణ. దీంతో జైల్లో ఉన్న కరుణ రంగంలోకి దిగుతాడు. వచ్చి స్వర్ణని కలుస్తాడు. ఆమెకి చేసుకుందని తెలిసి షాక్‌ అవుతాడు. బాధపడతాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెబుతాడు. ఫ్యామిలీ వదిలేసి తనతో రమ్మని, లేదంటే ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తాడు. మరి కరుణ వార్నింగ్‌కి స్వర్ణ భయపడిందా? అతనితో వెళ్లిపోయిందా? ఇంతకి కరుణ ఎవరు? స్వర్ణకి అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఝాన్సీ కథేంటి? ఝాన్సీ..స్వర్ణగా ఎలా మారింది? తన ఫ్యామిలీ కోసం స్వర్ణ చేసిన పోరాటం ఏంటి? ఇందులో