
సమంత తెలుగులో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటోంది. `మా ఇంటి బంగారం` రిజల్ట్ తో ఆమె ఈ ట్యాగ్‌కి కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పొచ్చు. అభిమానులు కూడా అదే పేరుతో పిలుస్తున్నారు. అయితే సామ్ మాత్రం ఈ విషయంలో స్పష్టంగా ఉంటోంది. లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార కదా అని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. తాను కేవలం సమంత మాత్రమే అని చెప్పి తన గొప్పతనం చాటుకుంది. ఇదిలా ఉంటే సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. విజయవంతంగా రన్ అవుతోంది. వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్‌లోనూ అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన `మా ఇంటి బంగారం` మూవీ గత శుక్రవారం విడుదలైంది. నందిని రెడ్డి రూపొందించిన ఈ మూవీకి సామ్ భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించారు. అదే సమయంలో సమంతతో కలిసి ఈ మూవీని నిర్మించారు. ట్రాలాల ప్రొడక్షన్‌లో ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో గుల్షన్ దేవయ్య, దిగంత్, శ్రీముఖి, గౌతమి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. రెండో వారంలోనూ విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు మంచి వసూళ్లని రాబట్టింది. `మా ఇంటి బంగారం` ఏడు రోజుల్లో సుమారు అరవై కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు దీనికి రూ.59.53కోట్ల కలెక్షన్లు వచ్చాయి. గురువారం దీనికి రూ.2.65కోట్లు రావడం విశేషం. బుధవారంతో పోల్చితే గురువారం వసూళ్లు పెరిగాయి. ఈ రోజు శుక్రవారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం మరోసారి తన సత్తా చాటబోతుంది సమంత. ఈ మూవీ ఈ మూడు రోజులు అదిరిపోయే వసూళ్లని రాబట్టనుంది. దీంతో మొత్తం కలెక్షన్లు రూ.70-80కోట్లకు వెళ్లనుంది. లాంగ్ రన్ లో వంద కోట్ల దిశగా వెళ్తుందని ట్రేడ్ వర్గాలు