భళా.. ముల్కనూర్ సీడ్
Actor ProfilePolitician

భళా.. ముల్కనూర్ సీడ్

Total News1
Movie Updates0
Sources1
భళా.. ముల్కనూర్ సీడ్
Andhra Jyothy18 Jun 2026
భళా.. ముల్కనూర్ సీడ్

వరి విత్తనాల తయారీలో మేటి ఖరీఫ్‏లో లక్ష క్వింటాళ్ల వరి విత్తనాల అమ్మకాలే లక్ష్యం సన్నాలు 60 శాతం.. దొడ్డు రకాలు 40 శాతం అమ్మకమే ధ్యేయం ఇప్పటికే 60 వేల క్వింటాళ్ల వరి విత్తనాల అమ్మకాలు భీమదేవరపల్లి(వరంగల్): నాణ్యమైన విత్తనాల సరఫరాలో ముల్కనూర్‌ బ్యాంకు అగ్రగామిగా నిలుస్తోంది. సహకార రంగాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకువస్తున్న ముల్కనూర్‌ సహకార బ్యాంకు వరి విత్తనాల అమ్మకాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలుస్తోంది. 1970లో ముల్కనూర్‌ బ్యాంకు రైతుల కోసం వరి విత్తన తయారీ కోసం విత్తన శుద్ధి కార్మాగారం ఏర్పాటు చేసింది. ముల్కనూర్‌ సహకార బ్యాంకు తయారు చేస్తున్న వరి విత్తనాలు మంచి దిగుబడి, నాణ్యతగా ఉండడంతో వరి విత్తనాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఈ ఏడాది ఖరీఫ్‏లో కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‏ఘడ్‌ మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇస్తుండడంతో తెలంగాణలో రైతులు సన్నవడ్లు పండించేందుకు మొగ్గు చూపెడుతున్నారు. ఈ సంవత్సరం ముల్కనూర్‌ సహకార బ్యాంకు ద్వారా లక్ష క్వింటాళ్ల వరి విత్తనాలు అమ్మకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 60వేల క్వింటాళ్ల వరి విత్తనాలను రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేశారు. ఆర్‌ఎన్‌ఆర్‌, కేఎన్‌ఎం, బీపీటీ, విశ్వనాథ, తదితర సన్నవడ్లను తెలంగాణ రైతులు కొనుగోలు చేస్తుండగా, ముల్కనూర్‌ బ్యాంకు ఈ వరి విత్తనాలను రైతులకు విక్రయిస్తుంది. అలాగే జార్ఖండ్‌, ఒడిస్సా, ఛత్తీస్‏ఘడ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, తదితర రాష్ట్రాలకు దొడ్డు రకం వరి విత్తనాలను ముల్కనూర్‌ బ్యాంకు ఎగుమతి చేస్తుంది. ముల్కనూర్‌ బ్యాంకు ద్వారా ఎంటీయూ 1010, 1001, 1153, 1156, 1061, జేజేఎల్‌ 24423, ఐఆర్‌ 64, పీఆర్‌ 126 తదితర వరి విత్తనాలకు మంచి డిమాండ్‌ ఉంది. భీమదేవరపల్లిలో 3, కొత్తపల్లిలో 2, రత్నగిరిలో 1, గంటకు నాలుగు టన్నుల వరి విత్తనాలు తయారు