భర్త రాజ్ నిడిమోరుతో మాజీ భర్త ఏ మాయ చేసావే సినిమా రోజులు గుర్తుచేసుకున్న సమంత
Actor ProfileActor

భర్త రాజ్ నిడిమోరుతో మాజీ భర్త ఏ మాయ చేసావే సినిమా రోజులు గుర్తుచేసుకున్న సమంత

Total News1
Movie Updates0
Sources1
భర్త రాజ్ నిడిమోరుతో మాజీ భర్త ఏ మాయ చేసావే సినిమా రోజులు గుర్తుచేసుకున్న సమంత
Zee Telugu15 Jun 2026
భర్త రాజ్ నిడిమోరుతో మాజీ భర్త ఏ మాయ చేసావే సినిమా రోజులు గుర్తుచేసుకున్న సమంత

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కొత్త చిత్రం మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సమంత పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈమధ్య ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన సినీ జీవితంలోని మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన తొలి తెలుగు చిత్రం ఏ మాయ చేసావే గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సమంత మాట్లాడుతూ, “ఆ సమయంలో నాకు హైదరాబాద్ గురించి పెద్దగా తెలియదు. నేను ఎక్కువగా చెన్నైలోనే ఉండేదాన్ని. ఏ మాయ చేసావే సినిమా విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. ఆరోజు రాత్రి నా కజిన్ ఇంట్లో సినిమా గురించి ఆలోచిస్తా నిద్రపోయాను.. మరుసటి రోజు సినిమా చూసే అవకాశం దొరికింది” అని తెలిపింది. సినిమా విడుదలైన తర్వాత తన స్నేహితుల్లో ఒకరు ఓ రివ్యూ చదవమని పంపారని సమంత గుర్తు చేసుకుంది. ఆ రివ్యూలో తన గురించి చాలా మంచి మాటలు రాశారని చెప్పింది. ముఖ్యంగా “సమంత నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతుంది” అని అందులో పేర్కొనడం తనను ఎంతో ఆశ్చర్యపరిచిందని తెలిపింది. ఆ మాటలు చదివిన తర్వాత తనలో కొత్త ఆత్మవిశ్వాసం వచ్చిందని సమంత చెప్పింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తాను మంచి భవిష్యత్తు సాధించగలననే నమ్మకం అప్పుడే కలిగిందని పేర్కొంది. ఆ రివ్యూ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైందని, ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేదని వెల్లడించింది. ఏ మాయ చేసావే చిత్రం సమంత కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఆమెకు భారీ గుర్తింపు లభించింది. అనంతరం వరుస విజయాలతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగింది. ఇప్పుడు