భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి
Actor ProfilePolitician

భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి
Sakshi20 Jun 2026
భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి

సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. చట్టపాలనను ‘భయపాలన’ భర్తీ చేస్తోంది’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీలోని కూటమి పాలనపై మండిపడుతూ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఇప్పుడు పోలీసులకే ఎక్కువగా భయపడే పరిస్థితి వచ్చిందా అని ప్రశ్నించారు. ఏపీలో భయపెట్టే పాలనకు ముగింపు పలకాలన్నారు. ‘‘కస్టడీలో మరణించిన గాదె సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు కావచ్చు.. పోలీసుల వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేసి క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఇలాంటి వరుస ఘటనలు ఒక్కో విషాద సంఘటన మాత్రమే కాదు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలన పెంచిపోషించిన ప్రమాదకర సంస్కృతికి ఇవి ఫలితాలు. ఈ రోజు ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా? లేక చంద్రబాబు నాయుడి రెడ్ బుక్ ప్రకారమా? న్యాయం కాదు.. భయమే పోలీసింగ్‌కు చిహ్నంగా మారుతోంది. రెడ్ బుక్ ప్రకటించిన రోజు నుంచే, పోలీసుల ద్వారా రాజకీయ కక్షసాధింపును ప్రోత్సహిస్తే, పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే పరిస్థితి వస్తుందని, సంస్థలు కలుషితం అవుతాయని, పోలీసు వ్యవస్థలోని కొన్ని వర్గాలు చట్టాలు, నిబంధనలు, రాజ్యాంగ పరిరక్షణలను దాటి వ్యవహరించే ధైర్యం తెచ్చుకుంటాయని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది. ఆ హెచ్చరిక ఇప్పుడు బాధాకరమైన నిజంగా మారింది. మొదట రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు లక్ష్యంగా మారారు. తర్వాత జర్నలిస్టులు, మేధావులు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు లక్ష్యంగా మారారు. రాజకీయ వేధింపులతో మొదలైన ఈ ధోరణి ఇప్పుడు అదుపు లేని పోలీసింగ్‌గా మారింది. సాధారణ ప్రజలు కూడా బెదిరింపులు, వేధింపులు, అధికార దుర్వినియోగానికి బలవుతున్నారు. సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్ మనస్సాక్షిని కదిలించింది. తన కుమారుడి మృతదేహాన్ని ఇవ్వలేకపోతే కనీసం అతని చితాభస్మమైనా ఇవ్వాలని ఒక తల్లి