భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు
Actor ProfileCelebrity

భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు

Total News1
Movie Updates0
Sources1
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు
Zee Telugu14 Jun 2026
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Earthquake: తెలంగాణలో అర్థరాత్రి భూమి కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామును 2.26 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 3.8గా నమోదు అయ్యింది. భూప్రకంపనలతో జనాలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, పాల్వంచలో ఈ భూప్రకంపనలు వచ్చాయి. ఆకస్మికంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది నిద్రిస్తున్న వేళ ప్రకంపనలు గమనించి ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నా.. ప్రకంపనలు స్పష్టంగా కనిపించడంతో స్థానికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే, తీవ్రత 6 కంటే ఎక్కువగా ఉండి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. తెల్లవారుజామున 2:26 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గురించింది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ లేదా ఆధునిక మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్‌పై కొలుస్తారు. ఇది ఒక లాగరిథమిక్ స్కేల్. ప్రతి 1 పాయింట్ పెరుగుదలకు, ప్రకంపనల బలం 10 రెట్లు, శక్తి సుమారుగా 31-32 రెట్లు పెరుగుతుంది. 3.8 తీవ్రత గల భూకంపం సురక్షిత పరిధిలోకి వస్తుంది. కానీ భవనాలు కూలిపోవడం లేదా పెద్ద నష్టం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 3.0 కంటే తక్కువ: చాలా తేలికైనది, చాలా వరకు తెలియదు. 3.0–3.9: స్వల్పం : తరచుగా ప్రకంపనలు అనుభూతి చెందుతాయి