భక్తుల రద్దీ.. తిరుమల వెంకటేశ్వర క్షేత్రానికి రాజకీయ ప్రముఖుల తాకిడి
Actor ProfilePolitician

భక్తుల రద్దీ.. తిరుమల వెంకటేశ్వర క్షేత్రానికి రాజకీయ ప్రముఖుల తాకిడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భక్తుల రద్దీ.. తిరుమల వెంకటేశ్వర క్షేత్రానికి రాజకీయ ప్రముఖుల తాకిడి
Zee Telugu6 Sept 2026
భక్తుల రద్దీ.. తిరుమల వెంకటేశ్వర క్షేత్రానికి రాజకీయ ప్రముఖుల తాకిడి

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tirumala: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. సాధారణ భక్తులతోపాటు ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ ప్రముఖులతోపాటు పలువురు సినీ ప్రముఖులు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నది ఎవరెవరో తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం జరిగే దివ్య దర్శనాల్లో భాగంగా గురువారం పలువురు ప్రముఖులు వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అనంతరం వారు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిరుమల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం వీఐపీ దర్శన ఏర్పాట్లలో భాగంగా స్వామివారి సన్నిధికి చేరుకుని వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాజీ గవర్నర్‌ దర్శనం తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకులు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారి కృపతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సినీ ప్రముఖులు సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా తిరుమలలో దర్శనం చేసుకున్నారు. ప్రముఖ నటుడు సాయికుమార్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సాయికుమార్‌ మాట్లాడుతూ.. 'తిరుమల దర్శనం జీవితంలో అత్యంత పవిత్రమైన అనుభవం' అని తెలిపారు. ప్రముఖ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు