భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరో అతనే.. మీరు అస్సలు ఊహించలేరు
Actor ProfileActor

భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరో అతనే.. మీరు అస్సలు ఊహించలేరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరో అతనే.. మీరు అస్సలు ఊహించలేరు
Zee Telugu25 Jun 2026
భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరో అతనే.. మీరు అస్సలు ఊహించలేరు

Highest Remuneration Hero: భారతీయ సినీ పరిశ్రమలో హీరోల పారితోషికాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న నటులు పెద్ద స్టార్‌లుగా భావించబడేవారు. తరువాత కాలంలో ఆ మొత్తం రూ.10 కోట్లు, రూ.50 కోట్లు దాటి ఇప్పుడు వందల కోట్ల స్థాయికి చేరుకుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ ఈ విషయంలో కొత్త రికార్డు సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రణవీర్ సింగ్ ఒకే ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా రూ.325 కోట్లు సంపాదించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా ఆయన నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ ఆదాయం రణవీర్ నటించిన "ధురంధర్" సినిమా సిరీస్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. మొదట ఒకే సినిమాగా తెరకెక్కించిన ఈ కథను తర్వాత రెండు భాగాలుగా విడుదల చేశారు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధించాయి. మొత్తం కలెక్షన్లు రూ.3200 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం. సాధారణంగా నటులు ముందుగానే పారితోషికం తీసుకుంటారు. కానీ రణవీర్ సింగ్ ఈ సినిమాకు ఫిక్స్‌డ్ ఫీజు తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకునే ఒప్పందం చేసుకున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా సినిమా బడ్జెట్ పెరిగిన సమయంలో తనవంతు పెట్టుబడి కూడా పెట్టినట్లు సమాచారం. దీంతో సినిమాకు వచ్చిన లాభాల్లో ఆయనకు పెద్ద మొత్తంలో వాటా లభించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు సూపర్ స్టార్ రజనీకాంత్ పేరిట ఉండేది. ఆయన "జైలర్" సినిమాతో రూ.250 కోట్లకు పైగా సంపాదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే అల్లు అర్జున్ "పుష్ప 2", ప్రభాస్ "కల్కి 2898 AD" సినిమాల ద్వారా రూ.200 కోట్లకు పైగా అందుకున్నారని ప్రచారం జరిగింది.బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ కూడా "పఠాన్", "జవాన్" సినిమాల విజయంతో భారీ పారితోషికం అందుకున్నారు. అయితే ఇప్పుడు రణవీర్ సింగ్ ఆ రికార్డులను అధిగమించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ