
NEET-UG 2026 రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా ప్రశ్నాపత్రాల లకేజీ, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం టెలీగ్రామ్‌పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. జూన్ 22 వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో గూగుల్, ఆపిల్ తమ స్టోర్‌ల నుంచి యాప్‌ను తొలగించాయి. అలాగే టెలీగ్రామ్ సేవలపై పరిమితులు అమలు చేశారు. తాజాగా.. నీట్ రీ-ఎగ్జామ్ పూర్తి కావడంతో.. మళ్లీ టెలీగ్రామ్ యాప్‌పై ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. టెలీగ్రామ్ యాప్ మళ్లీ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే, కొంతమంది వినియోగదారులు మెసేజ్‌లు పంపడం లేదా స్వీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో టెలిగ్రామ్ ఆంక్షలను ప్రభుత్వం పొడిగించిందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. అయితే, యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం లేదా మళ్లీ లాగిన్ కావడం అవసరం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టెలీగ్రామ్‌లోని ఎడిట్ ఆప్షన్ తొలగింపు జూన్ 30 వరకు కొనసాగనుంది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో జులై 1 నుంచి టెలీగ్రామ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావచ్చునని పేర్కొంటున్నారు. ఈ సమయంలో తాత్కాలిక సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు