భారత్ లో బంగారానికి భారీగా తగ్గిన డిమాండ్.. ఏకంగా 70 శాతం డౌన్.. ఇలా జరుగుతుందేంటి
Actor ProfilePolitician

భారత్ లో బంగారానికి భారీగా తగ్గిన డిమాండ్.. ఏకంగా 70 శాతం డౌన్.. ఇలా జరుగుతుందేంటి

Total News1
Movie Updates0
Sources1
భారత్ లో బంగారానికి భారీగా తగ్గిన డిమాండ్.. ఏకంగా 70 శాతం డౌన్.. ఇలా జరుగుతుందేంటి
Samayam Telugu18 Jun 2026
భారత్ లో బంగారానికి భారీగా తగ్గిన డిమాండ్.. ఏకంగా 70 శాతం డౌన్.. ఇలా జరుగుతుందేంటి

Gold Import Duty Hike : భారతదేశంలో బంగారం అంటే ఎంత ఆసక్తి ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా మహిళలు గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసి ధరించాలని చూస్తుంటారు. పండగైనా, పబ్బమైనా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతలా బంగారం అనేది మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. కానీ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గతేడాది నుంచి పసిడితో పాటుగా వెండి ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. గత సంవత్సరమే ఏకంగా 70 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో పెరిగినా.. మళ్లీ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరిగి పసిడి ధరలు దిగొచ్చాయి. అయితే ఇక్కడే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలతో పసిడికి డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు నెలకు సగటున పసిడి దిగుమతులు కేవలం 25-30 టన్నులుగా మాత్రమే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఇది ఏకంగా 75-100 మెట్రిక్ టన్నుల వరకు ఉండేది. ఇక్కడ ప్రధానంగా పసిడి దిగుమతులపై సుంకాలు పెరగడమే కారణమని తెలుస్తోంది. అంటే ఇక్కడ సుంకాల పెంపు అనేది ప్రభుత్వ విధానపర నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది. ఇక్కడ పసిడి దిగుమతులు తగ్గేందుకు చాలానే కారణాలు ఉండొచ్చు. బంగారం ధరలు అధికంగా ఉండటం లేదా పసిడి డిమాండ్ తగ్గడం లేదా రీసైక్లింగ్ గోల్డ్ అంటే పాత ఆభరణాల్ని విక్రయించి కొత్తవి కొనుగోలు చేయడం పెరగడం వంటివి బంగారం డిమాండ్ తగ్గేందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఇక్కడ గోల్డ్ డిమాండ్ తగ్గించడంలో కేంద్రం పాత్ర కీలకంగా ఉంది. మోదీ పిలుపు.. పెరిగిన సుంకాలు..భారత్ ఎక్కువగా బంగారాన్ని దిగుమతుల రూపంలోనే తెచ్చుకోవాలి కాబట్టి దిగుమతి బిల్లు పెరిగిపోతోంది. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ క్రమంలోనే విదేశీ మారకం ఆదా చేసేందుకు బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ