భారత రాజ్యాంగాన్ని ఎక్కడ భద్రపరిచారు? ఆ పాత పుస్తకాన్ని ఎలా కాపాడుతున్నారు
Actor ProfilePolitician

భారత రాజ్యాంగాన్ని ఎక్కడ భద్రపరిచారు? ఆ పాత పుస్తకాన్ని ఎలా కాపాడుతున్నారు

Total News1
Movie Updates0
Sources1
భారత రాజ్యాంగాన్ని ఎక్కడ భద్రపరిచారు? ఆ పాత పుస్తకాన్ని ఎలా కాపాడుతున్నారు
Asianet News Telugu14 Jun 2026
భారత రాజ్యాంగాన్ని ఎక్కడ భద్రపరిచారు? ఆ పాత పుస్తకాన్ని ఎలా కాపాడుతున్నారు

మన భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే ఆత్మ. 1950 జనవరి 26న ఇది అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చాకే మనదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని భారతీయులు ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం.. అంటే చేతితో రాసిన రాజ్యాంగం. చేతితో రాసిన ఆ కాగితాలను పాడవకుండా ఇంతకాలం ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు? అసలు ఒరిజినల్ రాజ్యాంగ కాపీని ఎక్కడ భద్రపరిచారు? మీకు తెలుసా? మన రాజ్యాంగాన్ని టైప్ చేయలేదు.. ప్రఖ్యాత కాలిగ్రాఫర్ ప్రేమ్ బిహారీ నారాయణ రైజాదా తన చేతితో సొంతంగా రాశారు. ఆయన మంచి చేతిరాత కలిగిన వ్యక్తి. అందుకే ఆయన చేత రాయించారు. ప్రతి పేజీని కళాకారులు అందంగా చిత్రించారు. ఒరిజినల్ కాపీలను హిందీ, ఆంగ్లం రెండు భాషల్లోనూ రాశారు. అందుకే వీటిని ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భద్రపరిచారు. చేతితో రాసిన భారత రాజ్యాంగం నిజమైన కాపీలను న్యూఢిల్లీలోని పార్లమెంటు గ్రంథాలయంలో ప్రత్యేకంగా ఒక గదిలో భద్రపరిచారు. దాని పేజీలు, సిరా పాడవకుండా ఉండేలా చూసేందుకు భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే కాగితంపై ఉన్న అక్షరాలు చెదిరిపోకుండా కాపాడే వాతావరణాన్ని సృష్టించారు. ఎక్కువ కాలం పాటు కాగితాన్ని, దానిపై రాసిన సిరాను కాపాడడం చాలా కష్టమైన పని. రాజ్యాంగాన్ని పార్చుమెంట్ కాగితంపై చేతితో రాశారు. సాధారణ గదిలో ఉంచితే అక్కడున్న గాలిలో ఉన్న తేమ, ఆక్సిజన్ కారణంగా కాగితం పసుపు రంగులోకి మారిపోతుంది. లేదా కీటకాలు దానిని నాశనం చేస్తాయి. అందుకే రాజ్యాంగాన్ని హీలియంతో నింపిన ఒక ప్రత్యేక పారదర్శకమైన పెట్టెలో దాచారు. హీలియం అనేది దేనితోను రసాయనిక చర్య జరపని జడవాయువు. ఇది వాతావరణం నుండి ఆక్సిజన్ ను పూర్తిగా తొలగిస్తుంది. దీనివల్ల సూక్ష్మజీవులు పెరగవు. అప్పుడు కాగితం నాణ్యత అలాగే ఉంటుంది. రాజ్యాంగ కాపీలపై నేరుగా సూర్య కాంతి పడితే అతినీలలోహిత కిరణాలవల్ల