
ఉక్రెయిన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, భారతీయులు దేనికీ పైసా ఖర్చు పెట్టరు.. ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఓ కొత్త పుస్తకం వెల్లడించింది. వాషింగ్టన్, జూన్ 24: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించే వ్యూహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) మధ్య వైట్ హౌస్‌లో జరిగిన ఒక రహస్య భేటీకి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే జేడీ వెన్స్ ప్రతిపాదనను ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, 'భారతీయులు దేనికీ పైసా ఖర్చు పెట్టరు.. ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరు' అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఓ కొత్త పుస్తకం వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు మాగీ హేబర్‌మన్, జోనాథన్ స్వాన్ సంయుక్తంగా రాసిన 'రెజీమ్ చేంజ్' (Regime Change) అనే పుస్తకంలో ఈ ఆసక్తికరమైన సంభాషణను పొందుపరిచారు. సదరు పుస్తకం ప్రకారం.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పది రోజులకే, అంటే 2025 జనవరి 30న వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఒక కీలక సమావేశం జరిగింది. ఉక్రెయిన్-రష్యా శాంతి రాయబారిగా ట్రంప్ నియమించిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లాగ్ ఈ భేటీని ఏర్పాటు చేశారు. యుద్ధాన్ని ముగించడానికి ఆయన 'ఆన్ అమెరికా ఫస్ట్ ప్లాన్' పేరిట ఒక ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్లాన్ ప్రకారం.. ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా హక్కులను అమెరికా అధికారికంగా గుర్తించదు. అదే సమయంలో, ఆ ప్రాంతాలను బలవంతంగా తిరిగి స్వాధీనం చేసుకోబోమని ఉక్రెయిన్ అంగీకరించాలి. ఈ కాల్పుల విరమణ (Ceasefire) ను పర్యవేక్షించడానికి సరిహద్దుల్లో విదేశీ శాంతిభద్రతల సైన్యాన్ని మోహరించాలని కెల్లాగ్ ప్రతిపాదించారు. జేడీ వాన్స్ అభ్యంతరం.. భారత్