
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Zee5 Subscription: భారతదేశ ప్రజలకు మూడు దశాబ్దాలుగా వినోదంతోపాటు వార్త ప్రసారాలు అందిస్తున్న జీ మీడియా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. భారత క్రీడాభివృద్ధికి విశేష సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఫిఫా ప్రపంచకప్ హక్కులను పొందిన జీ మీడియా.. భారతదేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి చర్యలు తీసుకోనుంది. జీ5 సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయంతో భారత ఫుట్‌బాల్ అభివృద్ధికి జీ మీడియా ఖర్చు చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వినోద రంగంలో సరికొత్త విప్లవాలు సృష్టిస్తూ.. ఎంతోమంది ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చిన మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఇప్పుడు క్రీడారంగంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అభివృద్ధి కోసం గతంలో లీగ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుని.. భారత క్రికెట్‌లో సమూల మార్పులు తెచ్చిన జీ మీడియా ఇప్పుడు భారతీయ ఫుట్‌బాల్ రూపురేఖలను మార్చడానికి సిద్ధమైంది. దేశంలో దాగి ఉన్న యువ ఫుట్‌బాల్ ప్రతిభను గుర్తించి వారికి ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు జీ మీడియా ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీ మీడియా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 సభ్యత్వం పొందిన నగదుతో ఫుట్‌బాల్ అభివృద్ధికి వెచ్చించనుంది. జీ5 యాప్ ద్వారా ఫిఫా ప్రపంచకప్ వీక్షిస్తున్న సబ్‌స్క్రైబర్లు భారత ఫుట్‌బాల్ అభివృద్ధికి సహకరించనున్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించే ప్రతి జీ5 సబ్‌స్క్రైబర్ కూడా భారతీయ ఫుట్‌బాల్ ఎదుగుదలకు పరోక్షంగా తోడ్పడనుండడం విశేషం. జీ5 వేదికగా ఫుట్‌బాల్ వీక్షణల ద్వారా వచ్చే సబ్‌స్క్రిప్షన్ రాబడిలో 15 శాతం నిధులను నేరుగా భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం జీ మీడియా కేటాయించనుంది