
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేతో టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. హర్ష్‌దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించగా, గుర్నూర్ బ్రార్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు. గిల్ మెచ్చిన క్రికెటర్.. పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెటర్. అతడి బౌలింగ్ యాక్షన్‌ను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో గుర్నూర్ బ్రార్ సుప్రసిద్ధుడు. అయితే గుర్నూర్ చిన్న వయసులో క్రికెట్ కంటే ఫుట్‌బాల్, టెన్నిస్ ఆటను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కారణంగా క్రికెట్లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన సలహాతో గుర్నూర్ బ్రార్ తననుత తాను పరీక్షించుకోవడానికి క్రికెట్ ట్రయల్స్‌కు వెళ్లాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే ఇండియా అండర్-19 టీమ్‌కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్కడే గుర్నూర్ బ్రార్‌కు ప్రస్తుత టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పరిచయమయ్యాడు. అతడి టాలెంట్‌ను గమనించిన గిల్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్-ఏతో పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్‌కు నెట్‌బౌలర్‌గా వచ్చిన గుర్నూర్ బ్రార్‌కు అనుకోకుండా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. అప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికయిన గుర్నూర్ బ్రార్ లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గిల్ మరోసారి గుర్నూర్‌కు అండగా నిలబడి నెట్‌బౌలర్‌గా తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్‌కు సూచించాడు. ఈ సమయంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్