భారత్ కు షాకిచ్చిన అమెరికా
Actor ProfilePolitician

భారత్ కు షాకిచ్చిన అమెరికా

Total News2
Movie Updates0
Sources2
భారత్ కు షాకిచ్చిన అమెరికా.. మ్యాప్ మార్చేసి.. ఇండో పేరు తొలగించి
Andhra Jyothy17 Jun 2026
భారత్ కు షాకిచ్చిన అమెరికా.. మ్యాప్ మార్చేసి.. ఇండో పేరు తొలగించి

ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది

భారత్ కు షాకిచ్చిన అమెరికా
Eenadu17 Jun 2026
భారత్ కు షాకిచ్చిన అమెరికా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు గట్టి షాకిచ్చింది. ఈ ప్రాంతంలో పనిచేసే అగ్రరాజ్య సైనిక కమాండ్‌ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తీసేసింది. అంతేకాదు.. భారత చిత్రపటాన్ని కూడా మార్చి చూపించడం వివాదాస్పదమైంది. జీ-7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాకు చెందిన చారిత్రక ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ (US Indo-Pacific Command)’ పేరును మళ్లీ ‘యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చినట్లు అగ్రరాజ్య రక్షణశాఖ వెల్లడించింది. ‘‘చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్‌లో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తి పెంపొందించడం కోసం ఈ కమాండ్‌కు పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించాం’’ అని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. ఇక, ఈ కమాండ్‌ ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుపుతూ తమ వెబ్‌సైట్‌లో ఓ ఫొటోను ఉంచింది. అందులో ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌’ను పాకిస్థాన్‌ భూభాగంగా చూపించడం వివాదానికి దారితీసింది. యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ను 1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్‌. ట్రుమ్యాన్‌ ఏర్పాటుచేశారు. అగ్రరాజ్య వెస్ట్‌ కోస్ట్‌ నుంచి భారత పశ్చిమతీరం వరకు గత ఏడు దశాబ్దాలకు పైగా ఈ కమాండ్‌ సేవలందిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వంలో ఈ దళం కీలక పాత్ర పోషించింది. కొరియన్‌, వియత్నాం యుద్ధాల్లోనూ పనిచేసింది. ఎన్నో మానవతా ఆపరేషన్లను చేపట్టింది. అయితే, ట్రంప్‌ తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో 2018లో దీని పేరును ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహా సముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి దీని పేరులో ‘ఇండో’ అనే పదం చేర్చినట్లు నాటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ వెల్లడించారు. అయితే, ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా