భారీ వర్ష సూచన.. ' ' పరిధిలో హై అలర్ట్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Actor ProfilePolitician

భారీ వర్ష సూచన.. ' ' పరిధిలో హై అలర్ట్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Total News1
Movie Updates0
Sources1
భారీ వర్ష సూచన.. ' ' పరిధిలో హై అలర్ట్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Jyothy13 Jun 2026
భారీ వర్ష సూచన.. ' ' పరిధిలో హై అలర్ట్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 'హై అలర్ట్' ప్రకటించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్, జూన్ 13: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో 'హై అలర్ట్' ప్రకటించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వర్షాల వల్ల నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వాతావరణ శాఖ అందించే వర్ష సూచన వివరాల ఆధారంగా అధికారులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని సీఎం సూచించారు. నగరంలో సాధారణంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ముందస్తుగానే అత్యవసర బృందాలను మోహరించాలని ఆదేశించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ (GHMC), హైడ్రా (HYDRAA), విద్యుత్ శాఖ (TGSPDCL), వాటర్ బోర్డ్ సహా ఇతర అన్ని సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఈ క్రమంలోనే చీఫ్ సెక్రటరీ (CS), డీజీపీ (DGP), CURE స్పెషల్ సీఎస్‌లతో పాటు నగరానికి చెందిన సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షలు నిర్వహించి, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్