భారీ విరాళం.. లో భాగంగా 11 రాష్ట్రాల్లో రూ.7.13 కోట్లతో సామాజిక అభివృద్ధి పనులు ప్రారంభం
Actor ProfilePolitician

భారీ విరాళం.. లో భాగంగా 11 రాష్ట్రాల్లో రూ.7.13 కోట్లతో సామాజిక అభివృద్ధి పనులు ప్రారంభం

Total News1
Movie Updates0
Sources1
భారీ విరాళం.. లో భాగంగా 11 రాష్ట్రాల్లో రూ.7.13 కోట్లతో సామాజిక అభివృద్ధి పనులు ప్రారంభం
Zee Telugu17 Jun 2026
భారీ విరాళం.. లో భాగంగా 11 రాష్ట్రాల్లో రూ.7.13 కోట్లతో సామాజిక అభివృద్ధి పనులు ప్రారంభం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. V-Guard: ప్రముఖ వ్యాపార సంస్థ వీ-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన సామాజిక బాధ్యతలో (CSR) భాగంగా చేపట్టిన నారీశక్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ముగింపు వేడుకలో భాగంగా స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించింది. ఈ వేడుకలో భాగంగా మహిళా సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, దేశవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో వీ-గార్డ్ మొత్తం 56 ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిందని సగర్వంగా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఈ ప్రాజెక్టుల కోసం రూ. 7.13 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ప్రకటించింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, హర్యానా వంటి 11 రాష్ట్రాల్లోని సుమారు 78,000 మంది ఈ సేవా కార్యక్రమాలతో లబ్ధి పొందారు. సామాజికంగా అన్నివర్గాల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు వీ-గార్డ్ తన బాధ్యతను మరింత బలోపేతం చేసుకునేందుకే ఈ సామాజిక బాధ్యతను చేపట్టినట్లు పేర్కొంది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రధానంగా విద్యా రంగంలో సంస్కరణలు తెచ్చి వ్యవస్థను బలోపేతం చేయడం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన చేయడం వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వీ-గార్డ్ చేపట్టిన CSR ప్రాజెక్టులు దేశాభివృద్ధిలో భాగం అయ్యాయి. నారీ శక్తి కార్యక్రమంలో వీ-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వీ-గార్డ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రీనా మిథున్ చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ, "వీ-గార్డ్ తరపున మా సామాజిక బాధ్యత అనేది కేవలం కొన్ని కార్యక్రమాలకే పరిమితం కాదు. దీర్ఘకాలికంగా, స్థిరమైన మార్పును తీసుకువచ్చే వ్యవస్థలను నిర్మించడమే మా లక్ష్యం. విద్య