
Chhattisgarh: భార్యకు గుండు గీసి, మూత్రం తాగించిన కిరాతక భర్త.. పిల్లల ముందే అరాచకం! Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో మానవత్వాన్ని నిలువునా పూడ్చివేసే అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఒక కిరాతకుడు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి, గుండు గీసి, ముఖానికి మసి పూసి క్రూరంగా హింసించాడు. అంతటితో ఆగక పిల్లల ముందే ఆమెతో బలవంతంగా మూత్రం తాగించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు తార, నిందితుడు జితేంద్ర ఘసియా గత 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, కొన్నేళ్లుగా సాగుతున్న కుటుంబ కలహాలు, భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. తన పిల్లలను పోషించుకోవడానికి వేరే ప్రాంతంలో ఇళ్లల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. కష్టకాలంలో తనకు సహాయం చేసిన ఒక పరిచయస్తుడి ఇంట్లో ఆమె ఆశ్రయం పొందుతోంది. ఈ క్రమంలో జూన్ 14న భర్త జితేంద్ర ఆమె ఉంటున్న చోటును కనుగొని అక్కడికి చేరుకున్నాడు. ఆమెను బయటకు పిలిచి, పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ బూతులు తిట్టాడు. అనంతరం ఆమె కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి కిరాతకంగా దాడి చేశాడు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు ఆమె జుట్టును కత్తిరించి, గుండు గీశాడు. ముఖానికి మసి, ఇంజిన్ ఆయిల్ పూసి విపరీతంగా కొట్టాడు. ఆపై బలవంతంగా మూత్రం తాగించాడు. నిన్ను ప్రాణాలతో తగులబెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘోరకృత్యంలో పిల్లలను కూడా భాగస్వాములను చేసి, తల్లిని కొట్టాలంటూ వారిని పురమాయించాడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక వీడియోలో, నిందితుడు తన భార్యపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ కనిపించాడు. అయితే బాధితురాలు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తన భర్త మొదటి నుండి అనుమానిస్తూ, అదనపు