భార్య తిడుతున్నా వినలేదు
Actor ProfileActor

భార్య తిడుతున్నా వినలేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భార్య తిడుతున్నా వినలేదు, రాసలీలల నిత్యానంద స్వామిని ఇంటికి పిలిచి మరీ టోపీ పెట్టిన డైరెక్టర్
Asianet News Telugu8 Aug 2026
భార్య తిడుతున్నా వినలేదు, రాసలీలల నిత్యానంద స్వామిని ఇంటికి పిలిచి మరీ టోపీ పెట్టిన డైరెక్టర్

నిత్యానంద స్వామి గురించి పరిచయం అవసరం లేదు. స్వామీజీగా ఆయన ఎందరో భక్తులని సొంతం చేసుకున్నారు. భక్తులు ఆయనపై పెట్టుకున్న నమ్మకాలన్నీ నిత్యానంద స్వామి సాగించిన రాసలీలలతో పోయాయి. చివరకు జనాలు ఛీ కొట్టి, అరెస్ట్ అయ్యే వరకు నిత్యానంద స్వామి దిగజారిపోయారు. నటి రంజితతో రాసలీలలు నడుపుతున్న నిత్యానంద స్వామికి సంబంధించిన వీడియో లీక్ కావడంతో అతడి బండారం మొత్తం బయట పడింది. నటి రంజిత, నిత్యానంద వ్యవహారం బయటపడ్డాక ఆయన ఆశ్రమంలో ఉన్న మహిళలు కూడా నిత్యానంద లైంగిక వేధింపుల గురించి బయట పెట్టారు. దీనితో పోలీసులు అతడి అరెస్ట్ చేయడం జరిగింది. కేసు కోర్టులో నడుస్తుండగా నిత్యానంద దేశం విడిచి పారిపోయారు. నిత్యానందతో తనకు ఎదురైన ఒక ఆసక్తికర సంఘటనని టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తేజ బయట పెట్టారు. కష్టం, అవసరం అనేవి మనిషి ఏం చేయడానికి అయినా సిద్ధపడేలా చేస్తాయి. మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు. నిత్యానంద స్వామి హీలింగ్ చేస్తారు. ఆయన వస్తే మీ అబ్బాయికి ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పారు. పిల్లాడి ఆరోగ్యం గురించి కాబట్టి నేను కూడా సరే అన్నాను. కాకపోతే నిత్యానంద స్వామి రావాలి అంటే ఆయన ఆశ్రమానికి కానీ, ట్రస్ట్ కి కానీ రూ లక్ష డొనేట్ చేయాలి అని చెప్పారు. సరే అని రూ లక్ష చెక్కు ఇచ్చాను. నిత్యానంద స్వామి ఇంటికి వచ్చారు. అబ్బాయి ఏదో చేసి వెళ్లిపోయారు. ఆయన రాగానే మా ఇంట్లో పనిమనిషి, నా భార్య అందరూ కాళ్లపై పడి మొక్కారు. నేను మాత్రం దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాను. ఆయన వెళ్ళిపోయాక కొన్ని రోజులకు నేను ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. ఇదేంటి ఇలా చేశావ్, ఆయనకి చెక్కు ఎందుకు ఇచ్చావ్, అది బౌన్స్ అయింది అంటూ నా భార్య నన్ను తిట్టింది. మళ్ళీ వేరే చెక్కు ఇచ్చాను. అది కూడా బౌన్స్ అయింది