
‘జగిత్యాల అర్బన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. వారికి ఓ బాబు జన్మించాడు. గొడవల కారణంగా మూడేళ్లుగా భార్య పుట్టింటి వద్దే ఉంటోంది’. ‘బుగ్గారం మండలకేంద్రానికి చెందిన ఓ యువతి ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రెండునెలల నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పాప జన్మించినప్పటికీ సదరు మహిళ పుట్టింటి వద్దే పాపతో ఉంటూ పోషణ కోసం కోర్టులో కేసు వేసింది’. ‘కోరుట్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఆరేళ్ల క్రితం వివాహం చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు బాబు జన్మించాడు. అత్తామామలతోపాటు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగగా.. భర్త బాబును తన వద్దే ఉంచుకుని భార్యను పుట్టింటికి పంపాడు. దీంతో, ఆ మహిళ బాబు తనకు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది’. చివరి వరకు కలిసి ఉంటామని అ గ్నిసాక్షిగా ప్రమాణం చేసి వివాహం చేసుకున్న దంపతులు.. చిన్నచిన్న కారణాలతోనే విడిపోతున్నా రు. మరికొందరు భార్య ఓ చోట, భర్త మరో చోట, పిల్లలు ఇంకో చోట ఉంటూ ఏళ్ల తరబడి కుటుంబ కలహాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. దంపతుల మ« ద్య చిన్న గొడవలు, కుటుంబ విషయాల్లో విభేదాలతో పచ్చని కుటుంబాల్లో చిచ్చు మొదలవుతోంది. దీంతో ఏ ఒక్కరూ తగ్గకపోగా, నువ్వెంత అంటే నే నంత అంటూ భార్యాభర్తలు విడిపోతుండడం, చివరకు పంచాయితీలు, పోలీస్‌స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కుతూ ఏళ్ల పాటు కాలం వృథా చేస్తున్నారు. పిల్లలకూ ఇబ్బందులే.. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలతో వారి పిల్లలు కూడా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది పిల్లలు తల్లి వద్ద, మరికొంత మంది తండ్రి వద్ద ఉంటున్నారు. ఇద్దరూ మెట్టు దిగిరాకపోవడంతో వారి పిల్లలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. తల్లి వైపు ఉండాలో, తండ్రి