
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate: బంగారం ధరలు ఎవరూ ఊహించని స్థాయిలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన మూడు నాలుగు రోజులుగా గమనించినట్లయితే ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గుతున్నట్లు మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 4100డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44లక్షల వద్ద కొనసాగుతోంది. ఒకే నెలలో సుమారు 6 శాతం వరకు బంగారం ధర తగ్గినట్లు మనము గమనించవచ్చు. జూన్ నెలలో బంగారం ధర గరిష్టంగా 1. 55 లక్షల రూపాయల వరకు పెరిగింది. అంటే ఒకే నెలలో సుమారు 10వేల రూపాయల వరకు తగ్గినట్లు మనం గమనించవచ్చు. అయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అని చెప్పాలి. దీనికి తోడు డాలర్ విలువ పెరగడం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టేందుకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. అన్నిటికంటే ప్రధానమైనది బంగారం దగ్గర తగ్గడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు భవిష్యత్తులో భారీగా పెంచుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇవి కూడా ఇన్వెస్టర్లను బంగారం నుంచి బయటకు వచ్చేందుకు దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు. సాధారణంగా బంగారం ధర అనేది ఎక్కువగా డాలర్ విలువపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే డాలర్ విలువ పడిపోతుందో అప్పుడు బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల నుంచి బయటకు తీసి బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. ఎప్పుడైతే అమెరికా డాలర్ విలువ పెరుగుతుందో అప్పుడు ధర బంగారం