భూముల పరిహారంలో జాప్యం.. బీటీడీఏ ఉద్యోగి
Actor ProfilePolitician

భూముల పరిహారంలో జాప్యం.. బీటీడీఏ ఉద్యోగి

Total News1
Movie Updates0
Sources1
భూముల పరిహారంలో జాప్యం.. బీటీడీఏ ఉద్యోగిపై చెప్పుతో రైతు దాడి
Andhra Jyothy13 Jun 2026
భూముల పరిహారంలో జాప్యం.. బీటీడీఏ ఉద్యోగిపై చెప్పుతో రైతు దాడి

ముంపునకు గురయ్యే భూములు, భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లించే విషయంలో జరుగుతున్న జాప్యంపై ఒక రైతు ఆగ్రహంతో ఊగిపోయాడు. కర్ణాటకలోని బాకల్‌కోట్ టౌన్ డవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం ఉద్యోగిపై చెప్పుతో దాడి చేశాడు. బాలాకోట్: ముంపునకు గురయ్యే భూములు, భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లించే విషయంలో జరుగుతున్న జాప్యంపై ఒక రైతు ఆగ్రహంతో ఊగిపోయాడు. కర్ణాటకలోని బాకల్‌కోట్ టౌన్ డవలప్‌మెంట్ అథారిటీ (BTDA) కార్యాలయం ఉద్యోగిపై చెప్పుతో దాడి చేశాడు. శనివారంనాడు చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సంఘటన వివరాల ప్రకారం, రైతు బసప్ప దొడ్డమనికి చెందిన భూమిని 2004లో బాగల్‌కోట్ సిటీకి అనుసంధానించే రోడ్డు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరించింది. అయితే తగిన నష్టపరిహారం విషయంలో జరుగుతున్న జాప్యంపై దొడ్డమని తీవ్ర అంసతృప్తితో ఉన్నాడు. ఈ విషయమై బీటీడీఏ ఉద్యోగి నీలకంఠ అంకాడ్‌ని కార్యాలయంలో కలుసుకుని నిలదీశాడు. అనంతరం ఆగ్రహంతో ఊగిపోతూ చెప్పుతో దాడికి దిగాడు. కార్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై అంకాడ్‌ను పక్కనున్న రూములోకి తరలించారు. అయినప్పటికీ ఆగ్రహం చల్లారని దొడ్డమని తనతోపాటే వచ్చిన మరికొందరితో కలిసి నినాదాలు చేశాడు. అనంతరం కార్యాలయం విడిచిపెట్టాడు. ఈ ఘటనపై బాగల్‌కోట్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అంకాడ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మోదీకి హగ్, పినరయికి దూరం.. రాహుల్‌ వైఖరిని నిలదీసిన సీపీఎం మమతకు మరో దెబ్బ.. రెబల్ క్యాంపులో టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్