
Namasthe Telangana•6 Jul 2026
భూపాలపల్లి జిల్లాలో దారుణం.. పట్టపగలే యువకుడిపై కత్తితో దాడిజయశంకర్ భూపాలపల్లి : పట్టపగలే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఒడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ పై ధన్వాడ – గుమ్మల్లపల్లి గ్రామాల మధ్య దాడికి పాల్పడ్డారు. గణేష్ కేకలు వేయడంతో సమీపంలోని రైతులు అక్కడికి చేరుకోగా దుండగులు వారిని చూసి పారిపోయారు. గణేష్ ఛాతిపై తీవ్ర గాయం కాగా అంబులెన్స్ లో భూపాలపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది