బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్
Actor ProfilePolitician

బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్
AP7AM21 Jul 2026
బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈరోజు చెన్నైలో రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ బస్సులో ప్రయాణించారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి, కనెక్టివిటీని పెంచడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 300 బస్సులను ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లో ప్రవేశపెట్టింది. ఈ బస్సులను విజయ్ అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. బస్సులను ప్రారంభించిన వెంటనే విజయ్ ఒక బస్సు ఎక్కారు. తెల్లటి చొక్కా, కళ్లద్దాలు ధరించి పక్కా స్టైలిష్ లుక్‌లో కనిపించిన సీఎం విజయ్.. కండక్టర్ సీటు పక్కన కూర్చుని బస్సు సిబ్బందితో ముచ్చటించారు. తోటి మంత్రులు పక్కనే నిలబడి చూస్తుండగా... కండక్టర్‌తో సరదాగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. బస్సు దిగే ముందు డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి, అతని భుజం తట్టి అభినందించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి