బలపం పట్టి భామ బళ్లో పాతలో బలపం అంటే ఏంటో తెలుసా.. పెద్ది కాంట్రవర్సీ
Actor ProfileCelebrity

బలపం పట్టి భామ బళ్లో పాతలో బలపం అంటే ఏంటో తెలుసా.. పెద్ది కాంట్రవర్సీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బలపం పట్టి భామ బళ్లో పాతలో బలపం అంటే ఏంటో తెలుసా.. పెద్ది కాంట్రవర్సీపై అనంత శ్రీరామ్
Zee Telugu2 Aug 2026
బలపం పట్టి భామ బళ్లో పాతలో బలపం అంటే ఏంటో తెలుసా.. పెద్ది కాంట్రవర్సీపై అనంత శ్రీరామ్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Peddi Controversy:పెద్ది సినిమాలోని ఐటెం సాంగ్‌పై వస్తున్న విమర్శలకు ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ మరోసారి స్పందించారు. తన పాటలోని పదాలకు కొందరు తప్పు అర్థాలు తీస్తున్నారని ఆయన అన్నారు. పాటను వినోదంగా ఆస్వాదించకుండా, అనవసరంగా వివాదం సృష్టించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన అనంత శ్రీరామ్, సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. పాటలోని కొన్ని పదాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా “వారానికి వెయ్యి” అనే పదబంధంపై వస్తున్న విమర్శలకు ఆయన వివరణ ఇచ్చారు. ఆ పదానికి తాను ఉద్దేశించిన అర్థం ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన, చప్పట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అసభ్యంగా అర్థం చేసుకోవడం సరైన విధానం కాదన్నారు. అలాగే, గతంలో కూడా ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన కొన్ని పాటలపై ఇలాంటి విమర్శలు వచ్చాయని అనంత శ్రీరామ్ గుర్తు చేశారు. ముఖ్యంగా “బలపం పట్టి భామ బళ్లో” పాట విడుదలైన సమయంలో కూడా కొందరు అనవసర వ్యాఖ్యలు చేశారని చెప్పారు. కానీ కాలక్రమంలో ఆ పాట మంచి పాటగా గుర్తింపు పొందిందని వివరించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సమాజంలో కొందరు ఏ విషయాన్నైనా విమర్శించే కోణంలోనే చూస్తారని అన్నారు. పాటలోని భావాన్ని అర్థం చేసుకోవడం కంటే, అందులో తప్పులు వెతకడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. మంచి ఉద్దేశంతో రాసిన పంక్తులకు కూడా వేరే అర్థాలు చెప్పడం బాధాకరమని చెప్పారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో