
జూన్ వచ్చిదంటే తల్లిదండ్రుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారంగా అడ్డగోలుగా వసూలు చేసే ఫీజులు భయపెడుతున్నాయి. వేలకు వేలు డొనేషన్లు, పుస్తకాలు, పెన్నులు, నోట్ బుక్‌లు, టైలు అంటూ ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన కూడా జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు ఆసిఫాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): జూన్ వచ్చిదంటే తల్లిదండ్రుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారంగా అడ్డగోలుగా వసూలు చేసే ఫీజులు భయపెడుతున్నాయి. వేలకు వేలు డొనేషన్లు, పుస్తకాలు, పెన్నులు, నోట్ బుక్‌లు, టైలు అంటూ ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన కూడా జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఏటా ఫీజుల భారం తప్పడం లేదు. జిల్లాలో ప్రైవేటు స్కూళ్లలో స్థాయిని బట్టి విద్యార్థులనుంచి ఫీజులన ు వసూలు చేస్తున్నారు. నర్సరీ, ఎల్‌కేజీకి రూ.8 వేల నుంచి రూ10 వేలు, యూకేజీకి రూ.10వేల నుంచి రూ12 వేలు, ఒకటి నుంచి ఐదు తరగతి వరకు రూ15వేల నుంచి రూ18వేలు,6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 18వేల నుంచి రూ20 వేలు, 9, 10 తరగతులకు రూ.22,000 నుంచి రూ.25,000 ఫీజులను వసూలు చేస్తున్నారు. దీంతో పాటు స్కూల్ వ్యాన్ ఫీజు అదనంగా వసూలు చేస్తున్నారు. జిల్లాలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల కన్నా నాణ్యమైన విద్యను అందించాలనే తపనతో ఉండే తల్లిదండ్రుల ఆశలను ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇష్టారాజ్యంగా పాఠశాలలు ఏర్పాటు చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు