బడ్డీ మదర్ ’కు ప్రధాని ప్రశంసలు
Actor ProfilePolitician

బడ్డీ మదర్ ’కు ప్రధాని ప్రశంసలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బడ్డీ మదర్ ’కు ప్రధాని ప్రశంసలు
Eenadu6 Jul 2026
బడ్డీ మదర్ ’కు ప్రధాని ప్రశంసలు

వృత్తిరీత్యా వైద్యురాలు ఆమె. అలానే ఉండిపోతే డా.ఎమ్‌.ఎస్‌ లక్ష్మీ ప్రియ సేవలు ఆరోగ్య వ్యవస్థకే పరిమితం అయ్యేవేమో. కానీ అన్ని రంగాల్లోనూ ఆమె సేవలందించాలని కలలు కన్నారు. సివిల్స్‌ సాధించి... వృత్తిరీత్యా వైద్యురాలు ఆమె. అలానే ఉండిపోతే డా.ఎమ్‌.ఎస్‌ లక్ష్మీ ప్రియ సేవలు ఆరోగ్య వ్యవస్థకే పరిమితం అయ్యేవేమో. కానీ అన్ని రంగాల్లోనూ ఆమె సేవలందించాలని కలలు కన్నారు. సివిల్స్‌ సాధించి... ఐఏఎస్‌ హోదాలో ఆమె తీసుకొచ్చిన మార్పులు ప్రధాన మంత్రి ప్రశంసలకు కారణమయ్యాయి. అది 2012... తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నైట్‌ డ్యూటీలో విధులు నిర్వర్తిస్తున్నారు లక్ష్మీ ప్రియ. పిల్లల్ని అపహరించే ముఠాల హల్‌చల్‌ ఎక్కువగా ఉన్న రోజులవి. అలాంటి గ్యాంగ్‌ లక్ష్మీ ప్రియకు తారస పడింది. వెంటనే అలర్ట్‌ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల్ని కాపాడారు. ఆ ఘటనే ఆమె ఐఏఎస్‌ కావడానికి కారణమైంది. ‘ఇలాంటి సామాజిక అన్యాయాల్ని ఎదురించాలంటే వైద్యురాలిగా ఉంటే సరిపోదు అనిపించింది. అందుకే పాలనా విభాగంలో భాగం అవ్వాలనుకున్నా. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అంటూ అందరూ వెనక్కిలాగే ప్రయత్నాలు చాలానే చేశారు’ అని గుర్తుచేసుకుంటారు లక్ష్మి. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ఆమె చేసిన త్యాగాలు చాలానే. అదే సంవత్సరం ఆమెకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి డీఫిల్‌ ఫెలోషిప్‌ చేసే అవకాశమూ వచ్చింది. కానీ స్వదేశంలో సేవ చేయాలనే ఉద్దేశంతో దాన్ని వదులుకున్నారామె. ఈమెది కేరళ. వైద్య వృత్తిని కొనసాగిస్తూనే యూపీఎస్సీకి సన్నద్ధం అయ్యారు. మూడుసార్లు అపజయాల్ని చవిచూశారు. అయినా వెనకడుగువేయకుండా ప్రయత్నించి అనుకున్నది సాధించారు. మొదటి పోస్టింగ్‌ అసోంలోని జోర్హాట్‌ జిల్లా. టీ ఎస్టేట్‌లకు ప్రసిద్ధి. అన్నీ మహిళల శక్తిసామర్థ్యాల మీద ఆధారపడి నడిచేవే. అలాంటి మహిళలే పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడటం గమనించారామె. దీనివల్ల ప్రసవ సమయంలో మరణాల రేటు అధికంగా ఉండేది. దీన్ని అరికట్టడానికి ‘స్టేట్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌’ సహాయంతో పౌష్టికాహారాన్ని అందించే ‘బగన్‌ బజార్‌’లను ఏర్పాటుచేశారు. ‘దీనిద్వారా న్యూట్రిషన్‌