బడ్జెట్ కాదమ్మా.. కంటెంట్ పెంచండి
Actor ProfileCelebrity

బడ్జెట్ కాదమ్మా.. కంటెంట్ పెంచండి

Total News1
Movie Updates0
Sources1
బడ్జెట్ కాదమ్మా.. కంటెంట్ పెంచండి
TV9 Telugu13 Jun 2026
బడ్జెట్ కాదమ్మా.. కంటెంట్ పెంచండి

ప్యాన్ ఇండియా సినిమా అనగానే వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చు పెట్టడమేనా..? ఓ సినిమా విజయం పెట్టిన బడ్జెట్‌లో ఉంటుందా లేక బలమైన కంటెంట్‌లో ఉంటుందా..? అద్భుతమైన క్లాసిక్ సినిమా తీయాలంటే భారీ సెట్టింగులు, వందల కోట్ల కలెక్షన్ల లెక్కలు కచ్చితంగా ఉండాల్సిందేనా...? ఈ విషయాలపై కమల్ హాసన్ ఇచ్చిన క్లారిటీ ఏంటో తెలుసా..? ప్యాన్ ఇండియన్ సినిమా అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పనైపోయిందిప్పుడు. వందల కోట్లు పెడుతున్నారు కానీ కంటెంట్ మీద ఫోకస్ చేయట్లేదనే విమర్శలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. పెట్టే బడ్జెట్, వచ్చే వసూళ్ల రేస్ మధ్య క్రియేటివిటీ పూర్తిగా వెనకబడిపోతుందని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయిప్పుడు. సినిమాకు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్పగా ఫీల్ అవ్వడం కాదని.. కంటెంట్ గొప్పగా ఉంటేనే మంచి సినిమా అవుతుందన్నారు కమల్. 15 లక్షలతో తీసిన పుష్పక విమానం సినిమా ఇప్పటి లెక్కల్లో వందల కోట్లకు విలువైన కంటెంట్‌ను అందించిందని ఆయన గుర్తుచేశారు. ఎక్కువ టైమ్, భారీ ఖర్చుపై కాకుండా కంటెంట్ మీద ఫోకస్ చేయాలంటూ చురకలంటించారు లోకనాయకుడు. కమల్ అన్నారని కాదు కానీ.. సింగీతం తీసిన భైరవద్వీపం, ఆదిత్య 369, పుష్పక విమానం లాంటివన్నీ దశాబ్దాలు గడిచినా కొత్తగా ఉంటాయి. బడ్జెట్‌తో పనిలేకుండా క్రియేటివిటీతో మెప్పించిన సింగీతం.. 94 ఏళ్ల వయసులో సినిమా అంతా పాటలతోనే ‘సింగ్ గీతం’ అంటూ జూన్ 11న వస్తున్నారీయన. మొత్తానికి కమల్ చెప్పిన కంటెంట్ మంత్రం మన దర్శకులను ఆలోచింపజేస్తుందా లేదా చూడాలి. నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్! ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు.. Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం