బాసర అమ్మవారి ఆలయంలో చోరీ
Actor ProfilePolitician

బాసర అమ్మవారి ఆలయంలో చోరీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాసర అమ్మవారి ఆలయంలో చోరీ
Eenadu4 Jul 2026
బాసర అమ్మవారి ఆలయంలో చోరీ

బాసర: నిర్మల్‌ జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. సరస్వతీ అమ్మవారి ఆలయం పైఅంతస్తులోని మహంకాళి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం, హుండీని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మహంకాళి ఆలయ గేటు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. నగదు కాజేసి.. అనంతరం హుండీని వ్యాసగుడి దగ్గర పడేసి పరారయ్యారు. అర్చకులు మంగళవారం తెల్లవారుజామున పూజ కోసం వెళ్లి చూడగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వా్‌డ్‌ రంగంలోకి దిగాయి. వెండి కిరీటం సుమారు కేజీన్నర ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆలయంలో చోరీ దృష్ట్యా.. నేడు జరగాల్సిన హుండీ లెక్కింపును అధికారులు వాయిదా వేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు, భైంసా సబ్‌ కలెక్టర్‌ ఆలయానికి చేరుకుని పరిశీలించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు