బావా బామ్మర్ది రిలేషన్ తో.. అనిల్ రావిపూడి మ్యాజిక్
Actor ProfileActor

బావా బామ్మర్ది రిలేషన్ తో.. అనిల్ రావిపూడి మ్యాజిక్

Total News1
Movie Updates0
Sources1
బావా బామ్మర్ది రిలేషన్ తో.. అనిల్ రావిపూడి మ్యాజిక్
Chitrajyothy17 Jun 2026
బావా బామ్మర్ది రిలేషన్ తో.. అనిల్ రావిపూడి మ్యాజిక్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్‌పై ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తోందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఆయన తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ భారీ విజయంతో మరింత ఉత్సాహంతో ఉన్న అనిల్ రావిపూడి, తన తదుపరి ప్రాజెక్ట్‌గా విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో ఒక క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మల్టీస్టారర్ కాంబినేషన్‌పై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడికి దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చి 'పటాస్' వంటి సూపర్‌హిట్‌ అందించిన హీరో కళ్యాణ్ రామ్ కాగా.. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో అనిల్‌కు ఎంతో లక్కీ హీరోగా మారిన విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో భాగం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సైతం ఇప్పటికే పూర్తి కాగా, త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ (Venkatesh), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఇద్దరూ బావ-బామ్మర్దులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సాగే సరికొత్త రిలేషన్ షిప్ బాండ్, ఒకరినొకరు కౌంటర్ వేసుకునే సీన్లు ఈ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవబోతున్నాయట. వెంకటేష్