
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ స్టామినా గత కొన్నేళ్లుగా ఏ స్థాయిలో ఊపందుకుందో తెలిసిందే. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) బాక్సాఫీస్ స్టామినా గత కొన్నేళ్లుగా ఏ స్థాయిలో ఊపందుకుందో తెలిసిందే. 'అఖండ' చిత్రంతో ఆయన మార్కెట్ అనూహ్యంగా విస్తరించింది. ఆ ఘన విజయం తర్వాత వచ్చిన 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' వంటి చిత్రాలు వరుసగా కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఈ క్రమంలో ఆయన క్రేజ్ ఐదేళ్ల క్రితం ఉన్నదానికంటే అనేక రెట్లు పెరిగిపోయింది. ఒకప్పుడు పరిమిత బడ్జెట్‌తో సినిమాలు చేసిన బాలయ్యతో ఇప్పుడు వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినా సునాయాసంగా రికవరీ చేయగలరనే భరోసా పరిశ్రమలో ఏర్పడింది. ఆయన మాస్ ఇమేజ్, బాక్సాఫీస్ పుల్ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే స్థాయికి చేరుకున్నాయి. అయితే.. వంద కోట్లకు మించి బడ్జెట్ పెరిగితే ఆశించిన స్థాయిలో రాబడి వస్తుందా అనే విషయానికి 'అఖండ-2' ఫలితం ఒక హెచ్చరికలా నిలిచింది. ఈ భారీ సీక్వెల్ కోసం నిర్మాతలు దాదాపు రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సినిమాపై ఉన్న అంచనాలతో మేకర్స్ దీనిని భారీ రేట్లకు విక్రయించారు. కానీ, విడుదలయ్యాక సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో పెట్టుబడికి తగ్గ లాభాలు రాలేదు. ఈ పరిణామం అటు నిర్మాతలతో పాటు ఇటు బయ్యర్లకు కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ ఫలితం తదుపరి ప్రాజెక్టులపైనా గట్టి ప్రభావాన్నే చూపించింది. 'అఖండ-2' విడుదలకు ముందే గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలయ్య ఒక భారీ పీరియాడిక్ కథను NBK111 పట్టాలెక్కించాల్సి ఉంది. దీని కోసం ఏకంగా రూ. 200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ పీరియాడిక్ కథను పక్కనపెట్టి, పెట్టుబడి భారాన్ని తగ్గించుకునేలా నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ పరిమితుల్లో ఉండేలా