బాలన్ ’ చిత్రానికి సూర్య దంపతుల ప్రశంసలు
Actor ProfileActor

బాలన్ ’ చిత్రానికి సూర్య దంపతుల ప్రశంసలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలన్ ’ చిత్రానికి సూర్య దంపతుల ప్రశంసలు
Chitrajyothy31 Jul 2026
బాలన్ ’ చిత్రానికి సూర్య దంపతుల ప్రశంసలు

గతవారం తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన ‘బాలన్‌: ది బాయ్‌’ చిత్రంపై ప్రముఖ హీరో సూర్య, ఆయన సతీమణి, నిర్మాత జ్యోతిక ప్రశంసల వర్షం కురిపించారు. ‘ గతవారం తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన ‘బాలన్‌: ది బాయ్‌’ (Balan: The boy) చిత్రంపై ప్రముఖ హీరో సూర్య(Suriya), ఆయన సతీమణి, నిర్మాత జ్యోతిక (jyothika) ప్రశంసల వర్షం కురిపించారు. ‘బాలన్‌’ మూవీ ఓ ఆణిముత్యం అంటూ కొనియాడారు. ‘మంజుమల్‌ బాయ్స్‌’ దర్శకుడు చిదంబరం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తల్లీ బిడ్డకు మధ్య మాతృ బంధాన్ని, సాన్నిహిత్యాన్ని ఓ కొత్త కోణంలో వెండితెరపై ఆవిష్కరించారు. ఈ మూవీకి సినీ విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా చూసిన సూర్య దంపతులు... చిత్ర బృందాన్ని అభినందించి ప్రశంసలు తెలిపారు. ఈ చిత్రంపై జ్యోతిక స్పందిస్తూ, ‘ఇది ఒక మాస్టర్‌ పీస్‌, చాలా వైవిధ్యంగా తీసిన చిత్రం. స్క్రీన్ ప్లే ఎంతో ఆసక్తికరంగా, ఊహించని మలుపులతో ఉంది. ఇందులో నటించిన ప్రతి నటీనటులకు అభినందనలు. నటుడు టోవినో థామస్‌ తన స్టార్‌ హోదా పక్కనబెట్టి ఇందులో చాలా సహజసిద్ధంగా నటించారు. హీరోయిన్‌గా నటించిన బర్సనా పలతింగల్‌, బాల నటులు అతిశేషన్‌, సినాన్‌ల నటన అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మలయాళ దర్శకుడు జీతు మాధవన్‌ దర్శకత్వంలో సూర్య ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ స్నేహం కారణంగా సూర్య దంపతులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపించారు