
Allu Arjun: వెండితెరపై ఫైట్లు చేస్తూ, భారీ డైలాగులు చెబితేనే హీరోలు అయిపోరు.. సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ, అభిమానుల గుండెల్లో నిలిచినప్పుడే వారు నిజమైన హీరోలనిపించుకుంటారు. టాలీవుడ్‌లో ఈ సంస్కృతి ఇప్పటిది కాదు. ఎంతోమంది తారలు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తమ చిన్నారి అభిమానుల చివరి కోరికలను తీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. మొన్నటికి మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండలో నిరంజన్ అనే బాలుడిని పరామర్శించగా… తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం అదే బాటలో నడుస్తూ బుజ్జి ఫ్యాన్స్ మొహంలో చిరునవ్వులు పూయించారు. Read Also : Athiradi Movie Review: ‘అథిరడి’ (సోనీ లివ్)సినిమా రివ్యూ మామ చూపిన బాటలోనే నడుస్తూ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్న శ్రద్ధ అనే చిన్నారికి అల్లు అర్జున్ అంటే అమితమైన ఇష్టం. తన ఫేవరెట్ హీరోను ఒక్కసారైనా చూడాలనేది ఆ పాప కోరిక. ఈ విషయాన్ని గమనించిన ‘మేక్-ఎ-విష్’ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు అల్లు అర్జున్ టీమ్‌ను సంప్రదించారు. దీనికి బన్నీ తక్షణమే అంగీకరించి, ఆ చిన్నారితో ప్రత్యేకంగా వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ హృదయపూర్వక సంభాషణలో బన్నీ ఎంతో ప్రేమగా “హాయ్ శ్రద్ధా, ఎలా ఉన్నావ్?” అంటూ పలకరించారు. అంతేకాకుండా, ‘పుష్ప’ సినిమాలోని ఐకానిక్ మేనరిజమ్స్ మరియు డైలాగులను ఆ చిన్నారితో కలిసి రీక్రియేట్ చేశారు. ఇద్దరూ కలిసి పుష్ప స్టైల్‌లో గడ్డం కింద చేయి తిప్పే సిగ్నేచర్ మూమెంట్‌ను చేయగా.. బన్నీ చప్పట్లు కొడుతూ “డ్యామ్ క్యూట్” అంటూ ఆ పాపను మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలని అల్లు అర్జున్ అడగ్గా, తాను పెద్దయ్యాక డాక్టర్ అవుతానని ఆ చిన్నారి సమాధానమిచ్చింది. దాంతో మురిసిపోయిన అల్లు అర్జున్.. “నువ్వు త్వరగా కోలుకోవాలి, ఆ తర్వాత కచ్చితంగా హైదరాబాద్ రావాలి” అని ప్రేమతో ఆహ్వానించారు