
ఇంటర్నెట్ డెస్క్: బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘NBK 112’గా ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఆ వివరాలను చిత్రబృందం పంచుకుంది. జూన్ 25న వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేశ్ (Nara Lokesh), కందుల దుర్గేశ్ హాజరుకానున్నారు. మే నెలలో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘‘అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది’’ అనే పవర్‌ఫుల్ కొటేషన్‌తో టీమ్ దీనిపై అంచనాలు పెంచేసింది. కొరటాల శివ మార్కు సామాజిక సందేశంతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో (NBK 111) నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. మంచు మనోజ్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలను బాలకృష్ణ ఒకేసారి పూర్తి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు