
నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్లో టాప్ హీరోగా, సీనియర్లలో ఒకరిగా రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో అత్యంత సక్సెస్ రేట్ ఉన్న హీరో కూడా బాలయ్యనే కావడం విశేషం. వరుసగా నాలుగు విజయాలు అందుకున్న బాలయ్యకి ఇటీవల `అఖండ 2`తో బ్రేకులు పడ్డాయి. కానీ ఇప్పుడు `ఎన్బీకే 111`తో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. గోపీచంద్ మలినేనితో ఈ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవల గ్లింప్స్ విడుదలయ్యింది. అది బాగా ఆకట్టుకుంది. సినిమాలపై అంచనాలను పెంచింది. ఇదిలా ఉంటే బాలయ్య తన ఫ్యామిలీ గురించి ప్రస్తావన ఎప్పుడూ తీసుకురారు. ఆయన కూతుళ్ల గురించి ప్రస్తావన వస్తుంటుంది. కానీ తన భార్య గురించి చాలా తక్కువగా మాట్లాడతాడు బాలయ్య. బాలకృష్ణకి 1982లో వసుంధర దేవితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు నారా బ్రాహ్మాణి, తేజస్వినితోపాటు కొడుకు మోక్షజ్ఞ తేజ ఉన్న విషయం తెలిసిందే. కూతుర్లకి పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత మూడు నాలుగేళ్లుగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ క్రమంలో బాలయ్య భార్యకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిసింది. వసుంధర దేవి పుట్టుకతోనే రిచ్ అట. ఆమె శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ (SRMT) అధినేత దేవరపల్లి సూర్యారావు కుమార్తె. పుట్టుకతోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వసుంధర గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే 1982లో బాలకృష్ణను వివాహం చేసుకున్నారు. వసుంధర దేవి ఫ్యామిలీ ఆస్తులు.. బాలయ్యని మించిన ఉంటాయని, వందల కోట్లు ఆస్తులున్నట్టు సమాచారం. అయినా వసుంధర దేవి చాలా వరకు పబ్లిక్‌కి దూరంగా ఉంటారు. ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా కూల్‌గా ఉంటారు. బయటకు పెద్దగా రారు, మీడియాకి దూరంగా ఉంటారు. పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమై ఉంటారు. పిల్లలు సరైన మార్గంలో నడవడంలో, వారిని ప్రయోజకులుగా