హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్‌లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ సీనియర్ హీరో, హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బోయపాటి శ్రీను, బాబీ కొల్లి పాల్గొన్నారు. క్యాన్సర్ ను జయించిన నటీమణులు గౌతమి, మమతా మోహన్ దాస్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన మమతా మోహన్ దాస్.. గతంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. ధైర్యంతో పోరాడి ప్రాణాంతక వ్యాధిని జయించారు. బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకలో మమతా ఎమోషనల్ గా మాట్లాడారు. తమ వ్యక్తిగత అనుభవాలను, ఆ సమయంలో ఎదుర్కొన్న వేదనను పంచుకుని స్ఫూర్తి నింపారు. గత 25 ఏళ్లుగా క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఆస్పత్రి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె బాలకృష్ణ పాదాలకు నమస్కరించి బ్లెస్సింగ్ తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ రాలేదని, రిఫ్రాక్టరీ హాడ్జ్‌కిన్స్ లింఫోమా అనే అరుదైన, తీవ్రమైన బ్లడ్ క్యాన్సర్ సోకిందని మమతా మోహన్ దాస్ వెల్లడించారు. కీమోథెరపీతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మామూలు ట్రీట్మెంట్ ఫలించని సమయంలో 2014లో అమెరికాలో నిర్వహించిన ఒప్‌డివో ఔషధ క్లినికల్ ట్రయల్ తన ప్రాణాలను కాపాడిందని గుర్తు చేసుకున్నారు.* 25 ఏళ్ల నాటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాం.. బసవతారకం హాస్పిటల్ రజతోత్సవంలో బాలకృష్ణక్యాన్సర్‌తో ఫైట్ చేసిన తర్వాత జీవితంపై తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని మమతా అన్నారు. ఇప్పుడు తాను పూర్తిగా నయం చేసుకోవడం గురించి కాకుండా.. ప్రతి రోజును ధైర్యంగా జీవించడం, మానసికంగా బలంగా ఉండడం, జీవితాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెడుతున్నానని చెప్పారు. అమెరికాలో క్యాన్సర్ రోగుల భావోద్వేగ స్థితిని
Actor ProfileActor
బాలకృష్ణ కాళ్లు మొక్కిన నటి మమతా మోహన్ దాస్.. బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎమోషనల్ స్పీచ్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•4 Jul 2026
బాలకృష్ణ కాళ్లు మొక్కిన నటి మమతా మోహన్ దాస్.. బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎమోషనల్ స్పీచ్