బాలీవుడ్ లో మరో బయోపిక్.. అవార్డ్ ఖాయమేనా
Actor ProfileActor

బాలీవుడ్ లో మరో బయోపిక్.. అవార్డ్ ఖాయమేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలీవుడ్ లో మరో బయోపిక్.. అవార్డ్ ఖాయమేనా
TV9 Telugu25 Jul 2026
బాలీవుడ్ లో మరో బయోపిక్.. అవార్డ్ ఖాయమేనా

సినిమా బాక్సాఫీస్ వద్ద బయోపిక్‌లు అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాయి. కథలో వాస్తవికత, భావోద్వేగాలను సమర్థవంతంగా చూపగలిగితే చాలు, కాసుల వర్షం కురుస్తోంది. గతంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి చిత్రం వాణిజ్యపరంగానే కాకుండా, అవార్డులను కూడా గెలుచుకుంది. ఇదే తరహాలో, తెలుగులో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ రాబోతోంది. రష్మిక మందన్న ఆ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే రష్మికతో లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, బాలీవుడ్‌లో మరో ప్రముఖ బయోపిక్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జానపద కళాకారిణి, డ్యాన్సర్, తమాషా మహారాణిగా గుర్తింపు పొందిన విఠాబాయి నారాయణ్ గావ్‌కర్ జీవిత కథ ఆధారంగా ఈట అనే చిత్రం రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రణదీప్ హుడా కీలక పాత్రలో కనిపించనున్నారు. శంభాజీ మహారాజ్ కథను చూపించిన లక్ష్మణ్ ఉటేకర్ ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. మహారాష్ట్రలోని వివిధ ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. శ్రద్ధా కపూర్ ఈ పాత్రలో ఒదిగిపోయినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈట చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. నాన్నే నా స్పూర్తి.. చరణ్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ.. చిరు మెచ్చిన బంగారం సమంత ఒక్క ఫొటోతో.. రకరకాల రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష ‘చేతబడులు.. క్షుద్ర పూజలు..’ సరదాగా ఈ వీకెండ్ వణికిపోవాలంటే ఈ సిరీస్ చూడండి!