బిల్లులు రాక అప్పుల బాధతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య
Actor ProfilePolitician

బిల్లులు రాక అప్పుల బాధతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బిల్లులు రాక అప్పుల బాధతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య
Namasthe Telangana8 Jul 2026
బిల్లులు రాక అప్పుల బాధతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య

EX Sarpanch | ప్రజలకు సేవ చేద్దామని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక సొంత నిధులతో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులకు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి భరోసా లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి సర్కార్‌లో మరో మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు రూ.11 లక్షలు పెట్టి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసిన పిట్ల సంపత్ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా బిల్లులు విడుదల కాకపోవడం, అప్పులకు మిత్తి పెరగడంతో మనస్తాపానికి గురయ్యారు. బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పుల బాధ భరించలేక ప్రాణాలు తీసుకున్నారు. బిల్లులు విడుదల చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సంపత్ కొడుకు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ నుంచి మా డాడీకీ బిల్లు ఇవ్వలేదు. సాయంత్రం అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతయన్నారు. ఇప్పుడున్న సిబ్బంది బిల్లులు ఇవ్వక టార్చర్‌ పెట్టారు.. అందుకే మా నాన్న చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరో మాజీ సర్పంచ్ బలవన్మరణం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ ఆత్మహత్య సుమారు రూ.11 లక్షలు పెట్టి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసిన సంపత్ — Telugu Scribe (@TeluguScribe) June 23, 2026 Volcano eruption | అగ్నిపర్వతం నుంచి భారీ విస్ఫోటనం.. పరుగులు తీసిన పర్యాటకులు Prabhas | 2027 ప్రభాస్ నామ సంవత్సరం.. ఒకటి కాదు మూడు భారీ ట్రీట్స్ ప్లాన్ చేస్తున్న రెబ‌ల్ స్టార్ MLA Vemula Prashanth reddy | రేవంత్‌