
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి చిన్న పాత్రలే సినిమాలకు పెద్ద అస్సెట్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు తమ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, నటనతో స్క్రీన్ మీద పండించే మ్యాజిక్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి చిన్న పాత్రలే సినిమాలకు పెద్ద అస్సెట్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు తమ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, నటనతో స్క్రీన్ మీద పండించే మ్యాజిక్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుల్లిరాజు నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బూతుల విషయం పక్కన పెడితే.. సినిమాకు బుల్లిరాజు పాత్ర హైలైట్ గా నిలిచింది. ఆ పాత్రలో నటించి మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ (Revanth) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ స్టార్ హీరో, హీరోయిన్ గా మారారు అన్న మాట వింటూనే ఉంటాం. రేవంత్ ఓవర్ నైట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారాడు. ఈ సినిమా తరువాత మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు లాంటి సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ యాక్టర్‌గా మారిపోయాడు. ఇక ఈ బ్యాక్-టు-బ్యాక్ సక్సెస్‌ల తర్వాత రేవంత్ క్రేజ్ టాలీవుడ్‌లో ఏ రేంజ్‌కు చేరిందంటే రోజుకు దాదాపు రూ. 1 లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసేంత.. అవును మీరు విన్నది నిజమే.. 30 రోజులు షూటింగ్ ఉంటే కనుక.. నెలకు రేవంత్ సంపాదన అక్షరాల 30 లక్షలు. ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఒక బాలనటుడికి ఈ స్థాయి డిమాండ్ మరియు రోజువారీ పారితోషికం దక్కడం ట్రేడ్ వర్గాల్లో సైతం ఆసక్తికర చర్చకు దారితీసింది. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాదు, రేవంత్ చేతిలో ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి