బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు
Actor ProfileActor

బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు, పవన్, వెంకీ సందడి చూశారా
Asianet News Telugu31 Aug 2026
బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు, పవన్, వెంకీ సందడి చూశారా

మెహర్ రమేష్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో మెహర్ రమేష్ సినిమాలు చేశారు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో వీర కన్నడిగ అనే చిత్రం తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగులో మెహర్ రమేష్ కి ప్రభాస్ తో తెరకెక్కించిన బిల్లా చిత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా మెహర్ రమేష్ కుమార్తె మోహన పెళ్లి వేడుక అనిరుధ్ తో హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తోట చంద్రశేఖర్ కుమారుడే అనిరుధ్. తోట చంద్రశేఖర్ గతంలో జనసేన పార్టీలో పనిచేశారు. వివాహ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవికి బంధువే. మోహన పెళ్లి వేడుకకు చిరంజీవి, సురేఖ దంపతులు హాజరయ్యారు. అదే విధంగా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దీక్షలో ఉన్నందున కాషాయ వస్త్రాల్లో కనిపించారు. వెంకీ మామ విక్టరీ వెంకటేష్ హాజరై వధూవరులని ఆశీర్వదించారు. అదే విధంగా కొరటాల శివ, అల్లు అరవింద్, ప్రభుదేవా లాంటి ప్రముఖులు కూడా పెళ్లి వేడుకలో మెరిశారు. మెహర్ రమేష్ కి ఇటీవల దర్శకుడిగా సరైన విజయాలు లేవు. చివరగా చిరంజీవితో తెరకెక్కించిన భోలా శంకర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది